పారాలింపిక్స్‌ టీటీ సొనాల్‌ అవుట్‌

ABN , First Publish Date - 2021-08-27T09:28:03+05:30 IST

పారాలింపిక్స్‌ మహిళల టీటీలో భారత్‌కు చెందిన భవినాబెన్‌ పటేల్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. గురువారం హోరాహోరీగా జరిగిన గ్రూప్‌ ‘ఎ‘ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 మ్యా చ్‌లో 34 ఏళ్ల్ల భవినాబెన్‌ 3-1 స్కోరుతో...

పారాలింపిక్స్‌ టీటీ సొనాల్‌ అవుట్‌

టోక్యో: పారాలింపిక్స్‌ మహిళల టీటీలో భారత్‌కు చెందిన భవినాబెన్‌ పటేల్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. గురువారం హోరాహోరీగా జరిగిన గ్రూప్‌ ‘ఎ‘ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 మ్యా చ్‌లో 34 ఏళ్ల్ల భవినాబెన్‌ 3-1 స్కోరుతో మేగన్‌ షాక్లెటన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)ను చిత్తు చేసింది. నాలు గో గేమ్‌లో..గేమ్‌ పాయింటును కాపాడుకున్న పటేల్‌ ఆపై ఆధిక్యంలోకి రావడంతోపాటు గేమ్‌ ను గెలుచుకోవడం విశేషం. 




సొనాల్‌ నిష్క్రమణ: అయితే భారత్‌నుంచి పోటీలోవున్న మరో క్రీడాకారిణి సొనాల్‌బెన్‌ మనూభాయ్‌ పటేల్‌ ఓటమితో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌ క్లాస్‌ 3 గ్రూప్‌ పోరులో సొనాల్‌ 1-3 స్కోరుతో కొరియాకు చెందిన మెగ్‌లీ చేతిలో ఓడింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లోనూ సొనాల్‌ పరాజయం పాలైన విషయం విదితమే.


అనారోగ్యంతో వైదొలిగిన స్విమ్మర్‌ జాదవ్‌

స్విమ్మర్‌ సుయాష్‌ జాదవ్‌ అనారోగ్యం పాలయ్యాడు. ఫలితంగా శుక్రవారం జరగాల్సిన 200 మీ. వ్యక్తిగత మెడ్లే ఎస్‌ఎం 7 పోటీనుంచి అతడు వైదొలిగాడు. జాదవ్‌ జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నాడని భారత చెఫ్‌ డి మిషన్‌ గురుశరణ్‌ సింగ్‌ వెల్లడించాడు. దాంతో విశ్రాంతి తీసుకోవాలని, పోటీలో పాల్గొనకూడదని డాక్టర్లు అతడికి సలహా ఇచ్చారని తెలిపాడు. అయితే సుయాష్‌ కొవిడ్‌ పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని గురుశరణ్‌ తెలిపాడు. 27 ఏళ్ల జాద వ్‌ ఆరోగ్యం మెరుగైతే మిగిలిన రెండు ఈవెంట్లలో అతడు బరిలోకి దిగుతాడని చెప్పాడు. సుయాష్‌ తలపడే 100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఎస్‌బీ 7 పోటీ వచ్చేనెల ఒకటిన, 50 మీ. బట్టర్‌ ఫ్లై ఎస్‌ 7 ఈవెంట్‌ వచ్చేనెల మూడున జరగనున్నాయి. 

Updated Date - 2021-08-27T09:28:03+05:30 IST