చరిత్ర సృష్టించిన భవినాబెన్‌

ABN , First Publish Date - 2021-08-28T08:40:51+05:30 IST

భారత్‌కు చెందిన భవినాబెన్‌ పటేల్‌ చరిత్ర సృష్టించింది.

చరిత్ర సృష్టించిన భవినాబెన్‌

పారాలింపిక్స్‌

టీటీలో కాంస్యం ఖరారు

మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో ప్రవేశం


టోక్యో: భారత్‌కు చెందిన భవినాబెన్‌ పటేల్‌ చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకున్న తొలి భారత టేబుల్‌టెన్నిస్‌ ప్లేయర్‌గా ఖ్యాతి గడించింది. వరల్డ్‌ నెంబర్‌-5 బోరిస్లావా పెరిక్‌ రంకోవిక్‌ను వరుస గేముల్లో చిత్తుచేసిన భవినా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్లాస్‌ 4 విభాగం క్వార్టర్‌ఫైనల్లో 34 ఏళ్ల పటేల్‌ 11-5, 11-6, 11-7 స్కోరుతో కేవలం 18 నిమిషాల్లో సెర్బియా క్రీడాకారిణి బోరిస్లావాపై ఘన విజయం సాధించింది. శనివారం జరిగే సెమీ్‌సలో చైనాకు చెందిన జాంగ్‌ మియావోతో భవినా అమీతుమీ తేల్చుకుంటుంది. పారాలింపిక్స్‌ టీటీలో కాంస్యానికి ప్లేఆఫ్‌ పోరు లేకపోవడంతో..సెమీ్‌సలో ఓడిన ఇద్దరికీ పతకాలు  లభిస్తాయి. ఫలితంగా భవినాకు కాంస్యం ఖాయమైంది. అంతకుముందు ఉదయం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 12-10, 13-11, 11-6 స్కోరుతో జాయ్‌సీ డి అలివీరా (బ్రెజిల్‌)ను ఓడించిన భవినా పారాలింపిక్స్‌ టీటీ క్వార్టర్స్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత సాధించింది. 


పురుషుల 50మీ. ఎస్‌-5 విభాగంలో పోటీకి సిద్ధమవుతున్న చైనా స్విమ్మర్‌ లీ చావో



మహిళల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఎస్‌-8 విభాగంలో కాంస్య పతకం 

సాధించిన అమెరికా స్విమ్మర్‌ జెస్సికా


సకీనాకు ఐదో స్థానం:

పవర్‌లిఫ్టింగ్‌ మహిళల 50 కి. విభాగంలో సకీనా ఖాతున్‌ ఐదో స్థానంలో నిలిచింది. 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌ కాంస్య పతక విజేత సకీనా అత్యుత్తమంగా 83 కిలోలు ఎత్తింది. పురుషుల 65 కి. విభాగంలో జైదీప్‌ దేశ్వాల్‌ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. 

ఆర్చరీ.. : ఆర్చరీ పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ విభాగంలో రాకేశ్‌ కుమార్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా 699 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరిలో సుందర్‌ స్వామి (682 పాయింట్లు) 21వ స్థానంతో నిరాశ పరిచాడు. పురుషుల రికర్వ్‌ ఓపెన్‌ కేటగిరిలో..2019 ఏషియన్‌ పారా చాంపియన్‌షి్‌ప విజేత వివేక్‌ చికారా టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌ 55 కేటగిరి ఫైనల్లో టేక్‌చంద్‌ 9.04 మీ. సీజన్‌ బెస్ట్‌ దూరం విసిరి ఓవరాల్‌గా 8వ స్థానంలో నిలిచాడు. 


సెమీ్‌సలో గెలుస్తా : భవినా ఆత్మవిశ్వాసం

‘భారత ప్రజల మద్దతుతో సెమీస్‌ మ్యాచ్‌ను నేను తప్పక గెలుస్తా. ఆ పోరులో విజయం అందుకొనేలా నన్ను ప్రోత్సహించండి’ అని భవినాబెన్‌ కోరింది. గ్రూపులో ఒక మ్యాచ్‌ ఓడిన ఆమె రెండో పోరులో నెగ్గి నాకౌట్‌లో ప్రవేశించింది. భవినా సహచరి సొనాల్‌బెన్‌ పటేల్‌ మాత్రం రెండు గ్రూపు మ్యాచ్‌లూ ఓడి ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-08-28T08:40:51+05:30 IST