సరికొత్త చరిత్ర సృష్టించిన ఫెన్సర్ భవానీదేవి!

ABN , First Publish Date - 2021-03-15T02:57:50+05:30 IST

తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల ఫెన్సర్ భవానీదేవి సరికొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌కు

సరికొత్త చరిత్ర సృష్టించిన ఫెన్సర్ భవానీదేవి!

చెన్నై: తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల ఫెన్సర్ సీఏ భవానీదేవి సరికొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి ఫెన్సర్‌గా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకుంది. ఆమె ఈ ఘనత సాధించిన వెంటనే కేంద్ర క్రీడల మంత్రి కిరెణ్ రిజుజు దేవిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భవానీ దేవికి అభినందనలు. ఈ ఘనత సాధించిన తొలి భారత అమ్మాయిగా రికార్డులకెక్కింది. ఆమెకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని మంత్రి ట్వీట్ చేశారు. 


అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) పద్ధతిలో భవానీదేవి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 25 వరకు పారాలింపిక్స్ అక్కడే జరగనున్నాయి. నిజానికి గతేడాదే ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా, కరోనా  కారణంగా క్రీడలు వాయిదా పడ్డాయి.

Updated Date - 2021-03-15T02:57:50+05:30 IST