ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

ABN , First Publish Date - 2021-04-13T19:58:16+05:30 IST

వ‌రుస ఘ‌ట‌న‌లతో అల‌జ‌డి సృష్టిస్తున్న మావోయిస్టులు.. ఈ సారి భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

వ‌రుస ఘ‌ట‌న‌లతో అల‌జ‌డి సృష్టిస్తున్న మావోయిస్టులు.. ఈ సారి భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా పాటిస్తున్న మావోయిస్టు పార్టీ... తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వాలు మాత్రం సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు అంటూ షరతులు పెడుతోందని, చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసుల మరణానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. పోలీసుల అనివార్య మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసిందని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-04-13T19:58:16+05:30 IST