Bhadradri: క్లౌడ్‌ బరెస్ట్‌లకు కుట్ర జరిగినట్లు అనుమానం: కేసీఆర్

ABN , First Publish Date - 2022-07-17T18:17:55+05:30 IST

భద్రాద్రి (Bhadradri)లో ఊహించని విధంగా వరదలు వచ్చాయని సీఎం కేసీఆర్‌ (CM KCR) తెలిపారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు.

Bhadradri: క్లౌడ్‌ బరెస్ట్‌లకు కుట్ర జరిగినట్లు అనుమానం: కేసీఆర్

భద్రాద్రి: భద్రాద్రి (Bhadradri)లో ఊహించని విధంగా వరదలు వచ్చాయని సీఎం కేసీఆర్‌ (CM KCR) తెలిపారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు. భద్రాచలం (Bhadrachalam)లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్‌ పర్యటించారు. భద్రాచలం కరకట్ట దగ్గర గోదావరి (Godavari) వరదను ఆయన పరిశీలించారు. వరద ముంపు బాధితులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాన్ని కూడా పరిశీలించారు. వరదలొచ్చిన ప్రతిసారి భద్రాచలం మునగడం బాధాకరమని పేర్కొన్నారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. 


ఎత్తైన ప్రదేశాల్లో స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌కు కేసీఆర్‌ ఆదేశించారు. వరద బాధితుల పూర్తి సమాచారం సేకరించాలన్నారు. దేవుడి దయవల్లే కడెం ప్రాజెక్ట్‌కు ప్రమాదం తప్పిందన్నారు. క్లౌడ్‌ బరెస్ట్‌లకు కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో ఇలాగే కుట్రలు చేశారని తెలిపారు. గోదావరి నది దగ్గర కూడా కుట్ర చేశారని అనుమానాలున్నాయని పేర్కొన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయాన్ని కేసీఆర్ ప్రకటించారు.

Updated Date - 2022-07-17T18:17:55+05:30 IST