ఉపాధ్యాయుడిని వివాహం చేసుకున్న బెజోస్ మాజీ భార్య...

ABN , First Publish Date - 2021-03-09T02:04:21+05:30 IST

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెన్‌జీ స్కాట్ ఓ ఉపాధ్యాయుడిని వివాహం చేసుకుంది.

ఉపాధ్యాయుడిని వివాహం చేసుకున్న బెజోస్ మాజీ భార్య...

న్యూయార్క్ : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెన్‌జీ స్కాట్ ఓ ఉపాధ్యాయుడిని వివాహం చేసుకుంది. బెజోస్‌తో ఉన్న పాతికేళ్ల బంధానికి 2019 లో గుడ్‌బై చెప్పిన మెకెన్‌జీ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. తాజాగా డాన్ జివెట్ అనే పాఠశాల ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకుంది. మెకెన్‌జీ పిల్లలు చదువుతున్న పాఠశాలలోనే జివెట్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.


అయితే... ఈ ఇద్దరి పెళ్లి ఎన్ని రోజుల క్రితం అయింది ? లేదా... ఎంతకాలంగా వారు కలిసి ఉంటున్నారు ? అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. రెండు రోజుల క్రితం(శనివారం) తమ వివాహానికి సంబంధించి అధికారికంగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా మెకెన్‌జీ వయసు ప్రస్తుతం 50 ఏళ్లు. ఆమె ఆస్తి విలువ దాదాపు 53 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు 4 లక్షల కోట్లు.


ఇదిలా ఉంటే మెకెన్‌జీ వివాహంపై బెజోస్ కూడా స్పందించాడు. ‘జివెట్ చాలా మంచి వ్యక్తి. వారిద్దరు ఒక్కటైనందుకు ఆనందంగా ఉంది’ అని బెజోస్ పేర్కొన్నాడు. బెజోస్-మెకెన్‌జీలకు నలుగురు పిల్లలున్నారు. వారంతా ప్రస్తుతం మెకెన్‌జీతోనే ఉన్నరు. ఈ విషయాన్ని కూడా ఆమె తాజాగా వెల్లడించింది. 

Updated Date - 2021-03-09T02:04:21+05:30 IST