Better.com కంపెనీలో మరో 3వేల మంది ఉద్యోగుల తొలగింపు

ABN , First Publish Date - 2022-03-09T16:17:31+05:30 IST

జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ మార్ట్‌గేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కాం తాజాగా మరో 3వేల మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది...

Better.com కంపెనీలో మరో 3వేల మంది ఉద్యోగుల తొలగింపు

న్యూఢిల్లీ: జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ మార్ట్‌గేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కాం తాజాగా మరో 3వేల మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. బెటర్ డాట్ కాం కంపెనీ మరో 3,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.అమెరికా, భారతదేశాల్లో గణనీయమైన రీతిలో శ్రామిక శక్తిని తగ్గిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.మంగళవారం బెటర్ డాట్ కాం వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక లేఖలో బెటర్ డాట్ కాం తాత్కాలిక అధ్యక్షుడు కెవిన్ ర్యాన్ ఈ విషయం వెల్లడించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా మూలాధార పరిమాణంలో నాటకీయ తగ్గుదల కారణంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కెవిన్ ర్యాన్ చెప్పారు.


‘‘దురదృష్టవశాత్తూ మేం మా కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడానికి యూఎస్, భారతదేశం రెండింటిలో మా వర్క్‌ఫోర్స్‌ను గణనీయమైన రీతిలో తగ్గించాం’’ అని ర్యాన్ చెప్పారు. తొలగించే ఉద్యోగులకు కనీసం 60 పని దినాలు లేదా 80 పనిదినాల వరకు నగదు చెల్లింపులకు అర్హులని  తాత్కాలిక చీఫ్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-03-09T16:17:31+05:30 IST