నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు: జీవీఎల్

ABN , First Publish Date - 2020-12-26T20:30:00+05:30 IST

మిర్చి పంట దేశంలో ఎక్కువ సాగయ్యేది తెలుగు రాష్ట్రాల్లోనే అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు:  జీవీఎల్

గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి పంట ఎక్కువగా సాగవుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతుందని చెప్పారు. ఇక్కడి మిర్చికి డిమాండ్ ఉందన్నారు. ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పెట్టుబడి తగ్గించి.. ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-26T20:30:00+05:30 IST