స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-10-23T22:01:00+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆటో స్టాక్‌ల దన్నుతో నిఫ్టీ మరోసారి 11900 మార్కునకు ....

స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆటో స్టాక్‌ల దన్నుతో నిఫ్టీ మరోసారి 11900 మార్కునకు ఎగువన నమోదైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 127.01 పాయింట్లు (0.31 శాతం) లాభపడి 40685.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.90 పాయింట్లు (0.28 శాతం) బలపడి 11930.40 వద్ద క్లోజ్ అయ్యింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్, బజాజ్ ఆటో తదితర షేర్లు నిఫ్టీలో ముందంజలో ఉన్నాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, గెయిల్ తదితర షేర్లు వెనుకంజలో ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఒక్క ఫార్మా తప్ప దాదాపు అన్ని సూచీలు లాభాలతోనే ముగిశాయి. ఆటో సెక్టార్ 3 శాతం లాభంతో ముందంజలో ఉంది.

Updated Date - 2020-10-23T22:01:00+05:30 IST