సొరకాయ జ్యూస్‌తో సౌందర్యం

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

సొరకాయను జ్యూస్‌ రూపంలో తీసుకోవడం వల్ల అనేక సౌందర్యప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...

సొరకాయ జ్యూస్‌తో సౌందర్యం

సొరకాయను జ్యూస్‌ రూపంలో తీసుకోవడం వల్ల అనేక సౌందర్యప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...


  • రోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్‌ తాగితే ముఖంలో సహజసిద్ధమైన మెరుపు వస్తుంది. ముఖం కాంతిమంతంగా మారుతుంది.
  • సొరకాయ జ్యూస్‌ జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. ముఖంపై ఉత్పత్తి అయ్యే నూనెను నియంత్రణలో ఉంచుతుంది.
  • రోజూ ఉదయం ఒక గ్లాసు సొరకాయ జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకుంటే వయసుపైబడిన లక్షణాలు దరిచేరకుండా ఉంటాయి. చర్మంపై ముడతలు దూరమవుతాయి.
  • బట్టతల వస్తున్నట్లయితే సొరకాయ జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకోండి. మంచి ఫలితం కనిపిస్తుంది.
  • జుట్టు నెరుస్తున్నట్లయితే ఈ జ్యూస్‌ తాగండి. ఇది జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది.
  • ఈ జ్యూస్‌ రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
  • సొరకాయను చక్రాల్లా తరిగి కళ్లపై పెట్టుకుంటే కళ్లకు రిలీఫ్‌ లభిస్తుంది.
  • చర్మం మృదువుగా తయారయ్యేందుకు సొరకాయ జ్యూస్‌ సహాయపడుతుంది. ఒకవేళ జ్యూస్‌ తాగలేకపోతే సొరకాయను పేస్టుగా చేసి అందులో శనగపిండి, పెరుగు కలిపి ఫేస్‌ప్యాక్‌గా వేసుకున్నా ఫలితం ఉంటుంది.

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST