Abn logo
Jan 19 2021 @ 14:05PM

టీమిండియాకు బీసీసీఐ 5 కోట్ల నజరానా

బ్రిస్బేన్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానీ ప్రకటించింది. చారిత్రాత్మక విజయంతో భారత్ తిరిగొస్తున్న భారత జట్టుకు రూ.5 కోట్ల రూపాయల భారీ బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ జనరల్ సెక్రటరీ జై షా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఆసీసీ‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ తరపున రూ.5 కోట్ల నజరానా ప్రకటిస్తోంది. భారత క్రికెట్లో ఇదో మరపురాని అధ్యాయం. ఆటగాళ్ల ప్రతిభ పాటవాలకు ఈ మ్యాచ్ నిలువుటద్దం’ అంటూ జై షా తన ట్వీట్‌లో పేర్నొన్నారు.


Advertisement
Advertisement
Advertisement