Abn logo
Oct 18 2020 @ 12:28PM

ఏపీలో బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల ప్రకటన

Kaakateeya

అమరావతి: ఏపీలో బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ప్రకటించారు. 30 వేల పైబడి జనాభా కలిగిన బీసీ కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం వహిస్తారు. పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. చైర్మన్‌, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను కలిపి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లను ఏ-కేటగిరీ కింద, లక్ష-10లక్షల వరకు జనాభా ఉన్నవాటిని బీ-కేటగిరీ కింద, లక్ష లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను సీ-కేటగిరీ కింద విభజించారు. 

ఏపీ రజక వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, వాల్మీకి/బోయ, యాదవ, తూర్పుకాపు/గాజుల కాపు, మత్స్యకార, షేక్‌, ఏపీ ముస్లిం సంచార జాతుల, నగర/ఉప్పర, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వడ్డెర, గౌడ, కుమ్మరి/ శాలివాహన, కొప్పుల వెలమ, కురుబ/కురుమ, వన్యకుల క్షత్రియ, కళింగ, గవర, పద్మశాలి, గాండ్ల/తెలికుల, ముదిరాజ్‌/ముత్రాసి, నగరాలు, శెట్టిబలిజ, పాల-ఏకరి, కళింగ కోమటి/కళింగ వైశ్య, రెడ్డిక, జంగం, దేవాంగ, తొగట/తొగట వీర క్షత్రియ, కుర్మి/కారికాల భక్తుల, ఏపీ మోస్ట్‌ బ్యాక్‌ వార్డ్‌ వెల్ఫేర్‌, వడ్డెలు, పోలినాటి వెలమ, భట్రాజు, కృష్ణ బలిజ, మేదర, ఆరె కటిక, పెరిక, కుంచిటి వక్కలిగ, సూర్య బలిజ, ముదిలియార్‌, చాత్తాడ శ్రీవైష్ణవ, శిష్ట కరణం, వీరశైవ లింగాయత్‌, కూరాకుల/పొందర, బొందిలి, అయ్యారక, అతిరస, నూర్‌బాషా/ దూదేకుల, దాసరి, యాత, శ్రీశయన, ఈడిగ, అగ్నికుల క్షత్రియ, బెస్త, నాగవంశం వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీలను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement