బిసి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తుచేసుకోండి

ABN , First Publish Date - 2022-03-12T00:12:13+05:30 IST

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లో బీసీ విద్యార్థులకు అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.

బిసి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తుచేసుకోండి

హైదరాబాద్: మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లో బీసీ విద్యార్థులకు అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అవకాశాన్ని బంధు మిత్రులందరూ తమ కుటుంబంలో గాని తమ బంధువర్గంలో గాని తమ కులం లో గాని ఎవరైనా విద్యార్థులు పేదరికం వలన విద్యకు దూరం అవుతున్న సందర్భంలో వారికీ సమాచారం అందించి సహాయం చేయాలని తెలంగాణ బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర పేర్కొన్నారు. కుల సంఘ నాయకులు గా , విద్యావంతులుగా కొంత సమయాన్ని కేటాయించి గ్రామీణ తెలంగాణలో ఉన్న పేద బిసి బిడ్డలని ఆదుకోవాలని  ఆయన కోరారు. అలాంటివారికి తగిన సూచనలు ఇచ్చి వారికి అండగా నిలిచి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సీట్ల కొరకు అప్లై చేయడానికి రాష్ట్ర నాయకులు గానీ జిల్లా నాయకులు గానీ మండల నాయకులు ఆయా ప్రాంతాలలో చదువుకున్న కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న కొంతమంది బిసి యువతను ప్రోత్సహించి అందరికీ సీట్ల కోసం అప్లై చేసే విధంగా కృషి చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 


గురుకుల పాఠశాలలో అనుభవజ్ఞులైనఉపాధ్యాయుల బోధన ఉంటుంది.ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్  వంటి పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇస్తారు.ప్రభుత్వ వైద్య కళాశాలలు, సెంట్రల్ యూనివర్సిటీలో, అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ,ఢిల్లీ యూనివర్సిటీ,టీఎస్ తదితర ప్రముఖ వర్సిటీలో  అడ్మిషన్ పొందేందుకు ట్రైనింగ్ ఇస్తారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు హౌస్ మాస్టర్ /హౌస్ పేరెంట్ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. మార్చి 28వ తేదీలోగా ఆన్ లైన్ లో http://tgcet.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-03-12T00:12:13+05:30 IST