Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాజీ సీఎం రోశయ్య మృతికి బీసీ కమిషన్ ఛైర్మన్ ఘన నివాళి

హైదరాబాద్: విలువలతో కూడిన ప్రజా జీవితం. నిబద్ధత, నిజాయితీ, విషయ పరిజ్ఞానం, అజాత శత్రువు, నిరాడంబర జీవితం వెరసి కొణిజేటి రోశయ్య గా ,జీవించినంత కాలం మార్గదర్శకంగా బ్రతికిన రోశయ్య ఇక లేరని తెలియడం బాధాకరమని తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.రాజకీయ జీవితంలోకి రావాలని కోరుకునే ఔత్సాహికులకు రోశయ్య జీవితమే ఒక సందేశం.


రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికలలో, హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం నాకు కలిగింది.వారి సిఫార్సు తో నాడు కేంద్ర సామాజిక,సాధికారిక మంత్రిత్వ శాఖకు చెందిన సలహామండలి సభ్యుడిగా నియామకమై, జాతీయ స్థాయిలో సేవలు అందించే భాగ్యం కలిగింది. అనేక సందర్భాల్లో, అనేక వేదికలలో ఆయనతో పాటు అతిథిగా పాల్గొన్న అనుభవాలు మరువలేనివని అన్నారు. రోశయ్య లేని లోటు  పూడ్చలేనిదని అన్నారు. 

Advertisement
Advertisement