Viral Video: బతుకమ్మ చీరలు ఇష్టం లేని వారు వెళ్లిపోండి అంటే.. అందరూ లేచి వెళ్లిపోయారు!

ABN , First Publish Date - 2021-10-06T19:31:44+05:30 IST

తెలంగాణ పెద్ద పండుగ ‘బతుకమ్మ’ సందర్భంగా కేసీఆర్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Viral Video: బతుకమ్మ చీరలు ఇష్టం లేని వారు వెళ్లిపోండి అంటే.. అందరూ లేచి వెళ్లిపోయారు!

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ పెద్ద పండుగ ‘బతుకమ్మ’ సందర్భంగా కేసీఆర్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బతుకుమ్మ చీరల పేరిట ఇప్పటికే చాలా గ్రామాల్లో పంపిణీ జరుగుతోంది. కొన్ని చోట్ల నాణ్యత లేని చీరలు ఇస్తున్నారంటూ మహిళలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చీరల పంపిణీకి సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బతుకమ్మ చీరల కోసం వచ్చిన మహిళలను ఉద్దేశించి అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. ‘‘బలవంతం లేదు. ఇష్టం లేనివాళ్లు తీసుకోకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు’’ అని ప్రకటించడంతో అక్కడున్న మహిళలందరూ ఒక్కసారిగా లేచి వెళ్లిపోయారు. దీంతో చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అధికారులు షాకయ్యారు. ‘ఆత్మగౌరవం అందరికీ ఉంటుంది’ అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-06T19:31:44+05:30 IST