Abn logo
Oct 20 2020 @ 00:00AM

చిత్రమైన మహిమల గౌరమ్మ

Kaakateeya

బతుకమ్మను సాక్షాత్తూ ఆదిశక్తి రూపమైన గౌరీదేవిగా కొలుస్తారు. బతుకమ్మ సంబురాల్లో గౌరీ దేవిని కొలుస్తూ పాడే పాటలు అనేకం. వాటిలో ఈ గీతం సుప్రసిద్ధం.


శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ

చిత్రమై తోచునమ్మ గౌరమ్మ


- భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై

పార్వతీ దేవివై పరమేశురాణివై

పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ

భార్యవైతివి హరికినీ గౌరమ్మ


- ఎన్నెన్నో రూపాలు

ఏడేడు లోకాలు

ఉన్న జనులకు

కోరికలు సమకూర్చగా

కన్న తల్లివైతివి గౌరమ్మ

కామధేనువు అయితివి గౌరమ్మ


- ముక్కోటి దేవతలు

సక్కని కాంతలు

ఎక్కువ పూలు గూర్చి

పెక్కు నోములు నోమి

ఎక్కువ వారైతిరీ గౌరమ్మ


- ఈ లోకముల నుండియు గౌరమ్మ

తమరి కంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు

తమకింపు పట్టింపు సకల లోకంబుల

క్రమముచే పాలించగా గౌరమ్మ

కన్నుల పండుగాయే గౌరమ్మ

Advertisement
Advertisement