దేవాలయాలు పడగొట్టడమే వికేంద్రీకరణ: బచ్చుల అర్జనుడు

ABN , First Publish Date - 2020-09-21T18:05:19+05:30 IST

విజయవాడ: వైసీపీ 16 నెలల పాలనలో అరాచకాలు, మతాల మధ్య చిచ్చు, దాడులతో ముందుకు వెళుతోందని..

దేవాలయాలు పడగొట్టడమే వికేంద్రీకరణ: బచ్చుల అర్జనుడు

విజయవాడ: వైసీపీ 16 నెలల పాలనలో అరాచకాలు, మతాల మధ్య చిచ్చు, దాడులతో ముందుకు వెళుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల ఆర్జునుడు విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఔన్నత్యం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు గంగా నదిలో స్నానం చేసి హిందూ మతం ఔన్యత్వం కాపాడతామని చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం పైకి పట్టు వస్త్రాలతో కొండపైకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇస్తూ సంతకం పెట్టాల్సిన ధర్మాన్ని విడనాడారన్నారు. 


అన్యమతస్తులు కొండపైకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలన్నది మొదటి నుంచి వస్తున్నసంప్రదాయం అని బచ్చుల అర్జనుడు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడా కనిపించడం లేదని కానీ దేవాలయాలు పడగొట్టడంపై వికేంద్రీకరణ కనిపిస్తోందని బచ్చుల అర్జనుడు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే కానుకలు డైవర్ట్ చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు.


హిందూ మతంపై ఈ ప్రభుత్వం చేసే కుట్రలను హిందువులు తిప్పికొడతారు అని పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ రేట్లు పెంచి ప్రతి జిల్లాలో ఆ లడ్డును మార్కెట్‌లో పెట్టి అమ్ముతున్నారని బచ్చుల అర్జనుడు విమర్శించారు. తిరుపతి దేవస్థానం డైరీలు కూడా తగ్గించారు అన్నారు. పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు ప్రక్కనే భార్య ఉండాలి అని సంప్రదాయాన్ని కూడా పక్కనబెట్టారన్నారు. ఈ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు రాతి బొమ్మలు మాదిరిగా చూస్తున్నారని బచ్చుల అర్జనుడు పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-21T18:05:19+05:30 IST