MP komatireddy: బస్వాపురం ప్రాజెక్టు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-07-16T18:22:25+05:30 IST
బస్వాపురం ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికసాయం అందించారు.
యాదాద్రి-భువనగిరి: బస్వాపురం ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికసాయం అందించారు. ఇరు కుటుంబాలకు రూ.75 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఈతకు వెళ్లి ఇద్దరూ మృతి చెందారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా చూడాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరిన ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నాయకులను కూడా అరెస్టు చేయడం బాధాకరమని కోమటి రెడ్డి వాపోయారు.