పడకేసిన మౌలిక రంగం

ABN , First Publish Date - 2020-07-01T06:10:52+05:30 IST

కరోనా దెబ్బతో మౌలిక రంగం కుదేలవుతోంది. అత్యంత కీలకంగా భావించే ఎరువులు, బొగ్గు, ముడి చము రు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీలు, సిమెంటు, విద్యుత్‌ ఉత్పత్తి, వరుసగా మూడో నెలా పడకేశాయి...

పడకేసిన మౌలిక రంగం

న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో మౌలిక రంగం కుదేలవుతోంది. అత్యంత కీలకంగా భావించే ఎరువులు, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీలు, సిమెంటు, విద్యుత్‌ ఉత్పత్తి, వరుసగా మూడో నెలా పడకేశాయి. గత  ఏడాది మే నెలతో పోలిస్తే, ఈ ఏడాది మే నెల్లో వీటి ఉత్పత్తి మైనస్‌ 23.4 శాతం పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఎనిమిది రంగాల్లో 3.8 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఒక్క ఎరువుల రంగంలోనే కొద్ది పాటి వృద్ధిరేటు కనిపించింది. మిగతా ఏడు రంగాలూ పూర్తిగా పడకేశాయి. 


Updated Date - 2020-07-01T06:10:52+05:30 IST