Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే: గవర్నర్

ABN , First Publish Date - 2022-08-08T02:04:11+05:30 IST

బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT) విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతు

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే: గవర్నర్

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT) విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతు ఒత్తిడి తీసుకొస్తానని గవర్నర్‌ తమిళి సై (Tamilisai) స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం పిల్లలు ఎండలో, వానలో నిరసన తెలపడం ఒక తల్లిగా తనను కలిచి వేసిందని.. అందువల్లే ఓ అమ్మగా వచ్చి ఇక్కడి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్‌ ఐటీతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్‌ సందర్శించారు. మొదటగా గవర్నర్‌ నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్‌ ఐటీని గవర్నర్‌ సందర్శించారు. ఉదయం వేళ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థి వసతి గృహలు, తరగతి గదులు, భోజన శాలలన్నింటినీ పరిశీలించారు. సుమారు నాలుగు గంటల పాటు గవర్నర్‌ ట్రిపుల్‌ ఐటీలో గడిపారు. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ట్రిపుల్‌ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, లైబ్రీలో సరైన సౌకర్యాలు లేవని, గత కొన్నేళ్ల నుంచి స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ జరగడం లేదని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు.

Updated Date - 2022-08-08T02:04:11+05:30 IST