పెద్దపల్లి: ఓ వ్యక్తి తాను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న గోమాత, లేగదూడకు జన్మనివ్వగా దాని యజమాని లేగ దూడకు బారసాల చేశాడు. ఈ ఘటన జిల్లాలోని జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. ఊరందరినీ పిలిచి ఆ లేగదూడకు బారసాల చేశాడు. అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు.. ఆ లేగ దూడకు నామకరణం కూడా చేశాడు.