సీఎస్ సమీర్‌శర్మ లెక్కలన్నీ తప్పులతడక: బండి శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2022-01-20T00:57:11+05:30 IST

సీఎస్ సమీర్‌శర్మ లెక్కలన్నీ తప్పులతడక అని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ అన్నారు. సీఎస్ మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు.

సీఎస్ సమీర్‌శర్మ లెక్కలన్నీ తప్పులతడక: బండి శ్రీనివాస్‌

అమరావతి: సీఎస్ సమీర్‌శర్మ లెక్కలన్నీ తప్పులతడక అని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ అన్నారు. సీఎస్ మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 3 జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల అంగీకారం లేకుండా ప్రభుత్వమే ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. జీవోలు రద్దు చేసేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లమని స్పష్టం చేశారు. డీఏలు ఇచ్చి జీతంలో కోత విధించడం మోసపూరితమన్నారు. కేంద్ర పే స్కేల్‌ను అమలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తాం దాచుకున్న డబ్బును ఎక్కడికి మళ్లించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్ అంటే జీతాలు పెరగాలి.. తగ్గకూడదన్నారు.  పీఆర్సీ సమయంలోనే డీఏ ఎందుకు ఇస్తున్నారు? అని బండి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. డీఏలను చూపించి జీతం పెరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తతం చేశారు. పీఆర్సీ వద్దు, 27 శాతం ఐఆర్ ఇస్తేచాలన్నారు. 



Updated Date - 2022-01-20T00:57:11+05:30 IST