Bandi Sanjayపై జగ్గారెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2022-06-19T22:20:53+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay)పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

Bandi Sanjayపై జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్: బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay)పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో కాల్పులకు బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్ ఇంటికి ధైర్యం ఉంటే బీజేపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. ‘అగ్నిపథ్‌’ రద్దయ్యేవరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని ప్రకటించారు. రాకేష్ డెడ్ బాడీ మీద టీఆర్‌ఎస్ జెండా ఎందుకు కప్పారు? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం చంపితే.. టీఆర్ఎస్ శవయాత్రల రాజకీయం చేస్తోందని  జగ్గారెడ్డి మండిపడ్డారు. 


‘అగ్నిపథ్‌’ వ్యతిరేక ఆందోళనలో పోలీసు కాల్పులకు బలైన దామెర రాకేష్‌కు భిన్న వర్గాలు శనివారం కన్నీటి వీడ్కోలు పలికాయి. టీఆర్‌ఎస్‌  నేతల ఆధ్వర్యంలో వరంగల్‌ నుంచి దబీర్‌పేట వరకు అంతిమయాత్ర ఆద్యంతం ఉత్కంఠ, ఉద్విగ్నభరితంగా సాగింది. రాకేశ్‌ భౌతికకాయం ఉన్న వాహనాన్ని అనుసరిస్తూ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు  ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. ఇక నగరంలో ఎంజీఎం మార్చురీ నుంచి వెంకట్రామ జంక్షన్‌ వరకు జరిగిన శవయాత్ర ఉద్రిక్తంగా సాగింది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. పలుచోట్ల  ప్రధాని నరేంద్రమోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. పోచమ్మ మైదాన్‌ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనంపైన టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెప్పులు, రాళ్ళు విసరడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

Updated Date - 2022-06-19T22:20:53+05:30 IST