Abn logo
Oct 1 2021 @ 16:37PM

ఈటల నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారు: బాల్క సుమన్‌

హుజురాబాద్: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ సమాధానం లేదన్నారు. బీజేపీ అంటేనే డ్రామా కంపెనీ అని ధ్వజమెత్తారు. సానుభూతి ఓట్ల కోసం డ్రామాలాడటం కొత్త కాదని విమర్శించారు. గతంలో బీజేపీ నేత బండి సంజయ్‌కు గుండె నొప్పి వచ్చిందని, ఎమ్మెల్యే రఘునందన్‌కు చేయి విరిగిందని, ఇప్పుడు ఈటల కూడా వీల్ చేయిర్‌లో కూర్చుని ఓట్లు అడుగుతారని బాల్క సుమన్‌ ఎద్దేవాచేశారు.

ఇవి కూడా చదవండిImage Caption