Abn logo
Sep 6 2021 @ 19:28PM

ఈటల వైఖరి మార్చుకోవాలి: బాల్క సుమన్‌

హుజూరాబాద్: దళిత ఎమ్మెల్యేలపై అసహనంతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌ తన వైఖరిని మార్చుకోవాలని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయం, డబ్బు, అహంకారంతో ఇష్టానుసారంగా ఈటల మాట్లాడుతున్నారన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేలు ప్రచారానికి రాగా ఈటల వారిని దూషిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఈటల రాజేందర్‌ కూడా పలు ఉప ఎన్నికల్లో ఇన్‌చార్జిగా ఉన్న విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అటువంటప్పుడు కేంద్ర మంత్రిని తీసుకొచ్చి సమావేశం ఎందుకు పెట్టారని బాల్క సుమన్‌ ప్రశ్నించారు. 

తెలంగాణ మరిన్ని...