కాలభైరవ స్వామి ఆలయంలో బాలకృష్ణ కుటుంబీకులు
ABN , First Publish Date - 2021-03-05T21:10:56+05:30 IST
జిల్లాలోని ప్రఖ్యాత శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సినీనటుడు బాలకృష్ణ
కామారెడ్డి: జిల్లాలోని ప్రఖ్యాత శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సినీనటుడు బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినీనటుడు బాలకృష్ణ ఏపీలోని హిందూపురం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 13వ శతాబ్దంలో ఇసన్నపల్లి గ్రామంలో నిర్మించారని గ్రామస్తులు చెబుతారు. ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఇదే. కార్తీక బహుళాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుతారు.