పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులు: బాజిరెడ్డి
ABN , First Publish Date - 2022-09-03T09:12:07+05:30 IST
తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులను
తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులను ప్రారంభించినట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రధానంగా కళాశాలు,పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యా లు, ప్రకృతి ప్రేమికులు విహార యాత్రలకు వెళ్లదలిచిన వారంతా ఆర్టీసీ పర్యాటక ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.