బజాజ్‌ అలియాంజ్‌ ‘ఆరోగ్య సంజీవనీ పాలసీ’

ABN , First Publish Date - 2020-04-12T06:06:09+05:30 IST

ప్రైవేటు రంగంలోని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తన ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం ‘ఆరోగ్య సంజీవనీ పాలసీ’ని అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌డీఏఐ తాజాగా జారీ...

బజాజ్‌ అలియాంజ్‌ ‘ఆరోగ్య సంజీవనీ పాలసీ’

ప్రైవేటు రంగంలోని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తన  ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం  ‘ఆరోగ్య సంజీవనీ పాలసీ’ని అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌డీఏఐ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పాలసీని కంపెనీ విడుదల చేసింది. ఇది వార్షిక పాలసీ. ఇందులో సమ్‌ ఇన్సూరెన్స్‌ రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉంది. ఈ పాలసీని ఇండివిడ్యువల్స్‌కే కాకుండా కుటుంబానికి అంటే భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తామామకు ఫ్లోటర్‌ ప్లాన్‌ కింద పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ కింద ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలు, ఆయుష్‌ చికిత్స, మానసిక అనారోగ్యం, స్టెమ్‌సెల్‌ థెరపీ, రోబోటిక్‌ సర్జరీలు వంటి వాటికి కవరేజీ లభిస్తుంది.


ఈ పాలసీ కింద ప్రీమియంను వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే వార్షికంగా లేదా ఆరు నెలలు, మూడు నెలలు లేదా నెలవారీగా చెల్లించవచ్చు. ఈ పాలసీలో కనీస ప్రీమియం రూ.2,400 (జీఎ్‌సటీ కాకుండా) నుంచి ప్రారంభం అవుతుంది. పాలసీదారుని వయసు, సమ్‌ అష్యూరెన్స్‌ను బట్టి ప్రీమియం మారుతుంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు కాగా గరిష్ఠ వయసు పరిమితి 65 ఏళ్లు. తల్లిదండ్రుల మీద ఆధారపడిన పిల్లల వయసు 3 నెలల నుంచి 25 ఏళ్ల వరకు ఉండవచ్చు. ప్రీ హాస్పిటలైజేషన్‌ వ్యయాలకు 30 రోజుల వరకు, పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌ వ్యయాలకు 60 రోజుల వరకు కవరేజీ లభిస్తుంది. ఈ పాలసీ కింద కోవిడ్‌-19 సంబంధిత హాస్పిటలైజేషన్‌ వ్యయాలకు కూడా కవరేజీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. 

Updated Date - 2020-04-12T06:06:09+05:30 IST