శతక్కొట్టిన బెయిర్‌స్టో

ABN , First Publish Date - 2022-06-25T10:22:21+05:30 IST

న్యూజిలాండ్‌ పేసర్ల ధాటికి 55 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన వేళ.. జానీ బెయిర్‌స్టో (126 బంతుల్లో 21 ఫోర్లతో 130 బ్యాటింగ్‌) మెరుపు శతకంతో ఇంగ్లండ్‌ను..

శతక్కొట్టిన బెయిర్‌స్టో

ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 264/6

లీడ్స్‌: న్యూజిలాండ్‌ పేసర్ల ధాటికి 55 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన వేళ.. జానీ బెయిర్‌స్టో (126 బంతుల్లో 21 ఫోర్లతో 130 బ్యాటింగ్‌) మెరుపు శతకంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అతడికి జేమీ ఒవర్టన్‌ (89 బ్యాటింగ్‌) సహకారం అందించడంతో ఆతిథ్య జట్టు రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 264/6 స్కోరు చేసింది. ఏడో వికెట్‌కు ఇప్పటికే 209 పరుగుల భాగస్వామ్యం లభించింది. అంతకుముందు న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. జాక్‌ లీచ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం కివీస్‌కన్నా ఇంగ్లండ్‌ 65 పరుగుల వెనుకంజలో ఉంది. 

Updated Date - 2022-06-25T10:22:21+05:30 IST