‘బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తాం’

ABN , First Publish Date - 2021-10-03T20:18:25+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తామని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. తమ గ్రామంలో ఓట్లు వేయమని

‘బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తాం’

కడప: బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తామని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. తమ గ్రామంలో ఓట్లు వేయమని స్పష్టం చేశారు. గత 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడగడం, ఓట్లు వేయించుకొని గెలిచిన తరవాత ఏ నాయకుడు తమ గ్రామం వైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకులను మా గ్రామంలోకి అనుమతించమని హెచ్చరించారు. గ్రామ పొలిమేరలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు హెచ్చరిక బోర్డు పెట్టారు. 


బద్వేలు ఉప ఎన్నిక పోరు షురూ అయింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ రెండు రోజుల క్రితం నోటిఫికేషన జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదే క్రమంలో ఈనెల 30వ తేదీ జరిగే పోలింగ్‌లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా చైతన్య కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.


Updated Date - 2021-10-03T20:18:25+05:30 IST