యాక్సిస్‌ డైరెక్ట్‌ ఫిన్‌ప్లాన్‌

ABN , First Publish Date - 2022-04-03T10:28:09+05:30 IST

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనుబంధ సంస్థ అయిన యాక్సిస్‌ డైరెక్ట్‌.. రిటైల్‌ మదుపరుల కోసం ప్రత్యేకంగా ఫిన్‌ప్లాన్‌ను తీసుకువచ్చింది.

యాక్సిస్‌ డైరెక్ట్‌ ఫిన్‌ప్లాన్‌

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనుబంధ సంస్థ అయిన యాక్సిస్‌ డైరెక్ట్‌.. రిటైల్‌ మదుపరుల కోసం ప్రత్యేకంగా ఫిన్‌ప్లాన్‌ను తీసుకువచ్చింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను సులభతరం చేసేందుకు ఈ ప్లాన్‌ దోహదపడుతుందని యాక్సిస్‌ డైరెక్ట్‌ తెలిపింది. ఈ ఫిన్‌ప్లాన్‌ ద్వారా మదుపరుల కోసం పోర్టుఫోలియో డాక్టర్‌, వెల్త్‌ బిల్డర్‌, ట్యాక్స్‌ ప్లానర్‌ పేరుతో ప్రత్యేక సేవలను అందించనుంది. పోర్టుఫోలియో డాక్టర్‌ ప్రతి నెలా ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షించటమే కాకుండా ఎక్కడ పెట్టుబడులకు అవకాశాలున్నాయో వివరిస్తుంది. ఇక వెల్త్‌ బిల్డర్‌.. ఒక టెక్నాలజీ ఆధారిత టూల్‌. ఇది మదుపరుల ఆర్థిక హోదా ఆధారంగా ఎక్కడ సంపద వృద్ధికి అవకాశాలున్నాయో వాటి గురించిన సమగ్ర సమాచారం అందిస్తుంది. మరోవైపు పన్ను ఆదాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలియచేయటంతో పాటు ఇన్వెస్టర్ల ప్రస్తుత పెట్టుబడులను పూర్తి స్థాయిలో విశ్లేషించనుంది.

Updated Date - 2022-04-03T10:28:09+05:30 IST