శానిటైజర్ల‌పై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-03-31T05:43:34+05:30 IST

కరోనా నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. చేతుల పరిశుభ్రతకి శానిటైజర్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒక్కప్పుడు ఇవి వైద్యశాలల్లో...

శానిటైజర్ల‌పై అవగాహన అవసరం

కరోనా నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. చేతుల పరిశుభ్రతకి శానిటైజర్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒక్కప్పుడు ఇవి వైద్యశాలల్లో మాత్రమే ఉండేవి. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నది శానిటైజర్‌ విషయంలోనూ వర్తిస్తుంది. ఇటీవల శానిటైజర్స్ తాగి చనిపోతున్నవారి గురించి వార్తల్లో చూస్తున్నాం. అంతేగాక, అధిక మోతాదులో శానిటైజర్‌ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి ఎంతో అవసరం. సబ్బు, నీరు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్‌ వాడకానికి దూరంగా ఉండటం మంచిది. ఓ 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని తరిమికొట్టొచ్చని ‘యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్’ చెప్తోంది. శానిటైజర్‌లో కలిపే గ్లైజిన్ తాగితే ఊపిరితిత్తులు దెబ్బతిని లిపిడ్ న్యుమోనియా వస్తుంది. కిడ్నీలు కూడా పాడౌతాయి. వాంతులు, విరేచనాలతో చనిపోతారు. మద్యం ధరల వల్ల కొందరు శానిటైజర్ తాగి అనారోగ్యం బారినపడుతున్నారు. వీటిపై సరైన అవగాహన కల్పించాల్సి ఉంది.

యమ్. రామ్ ప్రదీప్

Updated Date - 2021-03-31T05:43:34+05:30 IST