హైదరాబాద్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించినందుకు బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ (బీవోసీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ సత్యేంద్ర ప్రకా్‌షకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డు లభించింది. వివిధ విభాగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. కళాజాత, డిజిటల్ ప్రదర్శనల విభాగంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారం దక్కింది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో సత్యేంద్ర ప్రకాష్ ఈ అవార్డు అందుకోనున్నారు.