రమణను తప్పించండి!

ABN , First Publish Date - 2020-09-22T08:33:18+05:30 IST

రమణను తప్పించండి!

రమణను తప్పించండి!

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీటీఎస్‌ అధ్యక్షుడు రమణ వైఖరి పట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్‌ నేతలు.. ఆయన్ను తప్పించాలంటూ అధినేత చంద్రబాబును కోరాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయాలనీ వారు అభ్యర్థించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సిద్ధం చేసుకున్న లేఖను నేడో, రేపో చంద్రబాబుకు అందజేయాలని నిర్ణయించుకున్నారు. రమణ తీరుపై పలువురు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు చంద్రబాబుకు ఇప్పటికే ఫిర్యాదు చేశారని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరో నేత ఆరోపించారు. మరోవైపు, తనకు వ్యతిరేకంగా లేఖ ఇచ్చిన తర్వాతే స్పందించాలని రమణ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీటీఎ్‌సలో రాజకీయం వేడెక్కింది.

Updated Date - 2020-09-22T08:33:18+05:30 IST