విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫ్రెష్టేషన్‌లో ఉన్నారని ఎద్దేవాచేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి కోసం చంద్రబాబు దీక్ష చేయడమేంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. దీక్షలపై చంద్రబాబు తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్నారు. పార్టీ ఆఫీస్‌లో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితం అంతా నేరమయమని అవంతి శ్రీనివాస్ తెలిపారు.