వెనక సీట్లోని అమ్మాయిని అద్దంలో చూస్తూ.. ఆటోవాలా నీచమైన చర్య..

ABN , First Publish Date - 2020-03-03T23:45:56+05:30 IST

ఆటోలో ఓ అమ్మాయిని ఎక్కించుకొని, రియర్‌వ్యూ మిర్రర్‌లో ఆమెను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్న ఆటోడ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

వెనక సీట్లోని అమ్మాయిని అద్దంలో చూస్తూ.. ఆటోవాలా నీచమైన చర్య..

ముంబై: ఆటోలో ఓ అమ్మాయిని ఎక్కించుకొని, రియర్‌వ్యూ మిర్రర్‌లో ఆమెను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్న ఆటోడ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని ఎన్‌కే కాలేజికి బయలుదేరిందో అమ్మాయి. రోడ్డుపైకి వచ్చి ఓ ఆటో ఎక్కింది. ఆటో బయలుదేరిన కాసేపటికే దాని డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. వెనక సీట్లో కూర్చున్న యువతిని రియర్‌వ్యూ మిర్రర్‌లో చూస్తూ.. హస్తప్రయోగం చేసుకోవడం మొదలెట్టాడు. ఈ విషయం పసిగట్టిన సదరు యువతి అతను చేస్తున్న పనిని వీడియో తీసింది. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరలయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఆటోవాలను ట్రేస్‌చేసి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు శాఖ ట్విటర్ వేదికగా వెల్లడించింది.

Updated Date - 2020-03-03T23:45:56+05:30 IST