ఆటో, ఐటీ షేర్ల ర్యాలీ

ABN , First Publish Date - 2022-06-24T06:56:35+05:30 IST

ఆటో, ఐటీ రంగ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు దాదాపు ఒక శాతం మేర ఎగబాకాయి.

ఆటో, ఐటీ షేర్ల ర్యాలీ

443 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 

ముంబై: ఆటో, ఐటీ రంగ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు దాదాపు ఒక శాతం మేర ఎగబాకాయి. గురువారం  బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 443.19 పాయింట్లు పెరిగి 52,265.72 వద్ద స్థిరపడింది.  ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 143.35 పాయింట్ల లాభంతో 15,556.65 వద్ద ముగిసింది. కాగా అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం రేటు ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి రూ.78.32కు చేరుకుంది.


ఐపీఓకు బ్లూవాటర్‌ లాజిస్టిక్స్‌: బ్లూవాటర్‌ లాజిస్టిక్స్‌ (బీడబ్ల్యూఎల్‌).. పబ్లిక్‌ ఇష్యూకి రానున్నట్లు ప్రకటించింది. 2025 నాటికల్లా కంపెనీ టర్నోవర్‌ను రూ.500 కోట్లకు చేర్చట మే కాకుండా పబ్లిక్‌ ఇష్యూకు రావాలని చూ స్తున్నట్లు బీడబ్ల్యూఎల్‌ సీఓఓ లలిత్‌ పాండా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్‌ రూ.200 కోట్లుగా ఉందని చెప్పారు. విశాఖపట్నం, కృష్ణపట్నం, చెన్నై, జైపూర్‌, ముంబై, ఢిల్లీలో  సంస్థకు  శాఖలున్నాయి.

Updated Date - 2022-06-24T06:56:35+05:30 IST