మాల్దీవులకు ఆస్ట్రేలియా క్రికెటర్లు.. అప్పటి వరకు అక్కడే!

ABN , First Publish Date - 2021-05-06T21:36:05+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదాతో ఎటూ పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు భారత్‌ను

మాల్దీవులకు ఆస్ట్రేలియా క్రికెటర్లు.. అప్పటి వరకు అక్కడే!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదాతో ఎటూ పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు భారత్‌ను వీడారు. వారంతా తొలుత మాల్దీవులకు చేరుకుంటారు. భారత నుంచి వచ్చే ప్రయాణికులపై ఆస్ట్రేలియా విధించిన నిషేధం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వారంతా స్వదేశం చేరుకుంటారు. ఐపీఎల్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులు, కామెంటేటర్లు భారత్ నుంచి సురక్షితంగా మాల్దీవులకు పయనమయ్యారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ట్రావెల్ బ్యాన్ ముగిసే వరకు వారంతా అక్కడే ఉంటారని స్పష్టం చేసింది. 


ఐపీఎల్ రద్దయిన రెండు రోజుల్లోనే తమ ఆటగాళ్లు సురక్షితంగా మాల్దీవులకు చేరుకునేందుకు సాయపడిన బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) కృతజ్ఞతలు తెలిపాయి. కాగా, కరోనా బారినపడిన మైక్ హస్సీ మాత్రం భారత్‌లోనే ఉండిపోయాడు. హస్సీలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం అతడు చెన్నై సూపర్ కింగ్స్ పర్యవేక్షణలో ఉన్నాడని సీఏ, ఏసీఏ పేర్కొన్నాయి. ఈ విషయంలో బీసీసీఐతో నిరంతరం టచ్‌లోనే ఉంటామని, త్వరలోనే అతడు సురక్షితంగా ఆస్ట్రేలియా చేరుకుంటాడని ఆసీస్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.

Updated Date - 2021-05-06T21:36:05+05:30 IST