India vs Australia: భారత్‌పై టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2022-09-21T00:17:18+05:30 IST

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్

India vs Australia: భారత్‌పై టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

మొహాలి: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) బౌలింగ్ ఎంచుకుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకమైనది కావడంతో మ్యాచులు రంజుగా సాగే అవకాశం ఉంది.


ఈ మ్యాచ్ నుంచి టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బ్రేక్ తీసుకున్నాడు. బహుశా అతడు రెండో మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. అలాగే, పంత్ కూడా ఈ మ్యాచ్‌ను మిస్సయ్యాడు. అక్షర్ పటేల్, చాహల్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. పిచ్ హార్డ్‌గా, ఫ్లాట్‌గా ఉండడంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్టు ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తెలిపాడు. కాగా, ఆసీస్  డాషింగ్‌ బ్యాటర్‌ టిమ్ డేవిడ్‌ ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నాడు. విదేశీ లీగ్‌ల్లో భారీ షాట్లతో విరుచుకుపడే టిమ్‌తో భారత బౌలర్లు కొంత జాగ్రత్తగానే ఉండాలి.


టీ20 ప్రపంచక్‌పనకు ముందు భారత్‌ ఆడే మ్యాచ్‌లు ఆరు మాత్రమే. సమయం తక్కువగా ఉండడంతో ఈలోపే తమ కూర్పుపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టతకు రావాల్సిందే. ఎందుకంటే జట్టులో ఇప్పటికీ పలు సమస్యలున్నాయి. అందుకే ఆసీస్‌, దక్షిణాఫ్రికాలతో ఈ మ్యాచ్‌లు టీమిండియాకు అత్యంత కీలకం కానున్నాయి. కొన్ని నెలల తర్వాత పూర్తి స్థాయి ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న జట్టును మిడిలార్డర్‌తో పాటు ఆరో బౌలర్‌ సమస్య కూడా వేధిస్తోంది. అన్ని లోపాలను సరిచేసుకుని సిరీస్‌తో పాటు మెగా టోర్నీకి కూడా సిద్ధంగా ఉండాలనే ఆలోచనలో రోహిత్‌ సేన ఉంది.


మరోవైపు, ఆస్ట్రేలియా మాత్రం కీలక ఆటగాళ్లు లేకుండానే భారత్‌ వచ్చింది. ఓపెనర్‌ వార్నర్‌కు విశ్రాంతినివ్వగా పేసర్లు స్టార్క్‌, స్టొయినిస్‌, మార్ష్‌కు గాయాలయ్యాయి. కెప్టెన్‌ ఫించ్‌ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే వన్డేలకు గుడ్‌బై చెప్పిన అతడు ఈ సిరీస్‌తో ఆత్మవిశ్వాసం నింపుకోవాలని యోచిస్తున్నాడు.  

Updated Date - 2022-09-21T00:17:18+05:30 IST