సచినే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ షేన్‌ వార్న్‌

ABN , First Publish Date - 2020-03-31T10:19:25+05:30 IST

బరిలోకి దిగాక ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం సచిన్‌ టెండూల్కర్‌ సొంతమని ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ కొనియాడాడు. తాను క్రికెట్‌ ...

సచినే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ షేన్‌ వార్న్‌

మెల్‌బోర్న్‌: బరిలోకి దిగాక ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం సచిన్‌ టెండూల్కర్‌ సొంతమని ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ కొనియాడాడు. తాను క్రికెట్‌ ఆడిన సమయంలో సచినే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. ‘కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయగల సామర్ధ్యమున్న ఆటగాళ్లలో సచిన్‌, లారా ముందుంటారు. కానీ, ఇద్దరిలో ఒక్కరినే ఎంచుకోమంటే నేను సచిన్‌వైపే మొగ్గు చూపుతా. అయితే చివరి రోజు 400 పరుగులను ఛేదించాల్సి వస్తే లారాను ఎంపిక చేస్తా. ఇక మా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా మ్యాచ్‌ విన్నర్‌గా కాకుండా మ్యాచ్‌ను రక్షించేవాడిగా చెబుతా’ అంటూ వార్న్‌ తెలిపాడు.

Updated Date - 2020-03-31T10:19:25+05:30 IST