అచ్చెన్నపై అవినీతి మరక అంటించాలనే ప్రయత్నం: లోకేష్

ABN , First Publish Date - 2020-02-21T20:27:34+05:30 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అచ్చెన్నపై అవినీతి మరక అంటించాలనే ప్రయత్నం: లోకేష్

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘దొంగ పేపర్, దొంగ ఛానల్ ట్రాప్‌లో పడి మీ పరువు తీసుకోకండి. రూ. 2 వేల కోట్లు అంటూ అందరినీ తప్పుదోవ పట్టించారు. ఉన్నది రూ. 2 లక్షలే అని తెలిశాక నాలుక కరుచుకున్నారు. ఇప్పుడు బీసీ నాయకుడుపై పడ్డారు బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. తుగ్లక్ బీసీ నిధులు పక్కదారి పట్టించారని గళమెత్తినందుకు అచ్చెన్నాయుడుపై అవినీతి మరక అంటించాలనే ప్రయత్నిస్తున్నారు. మందులు, వస్తువుల కొనుగోళ్లకు ఎలాంటి లేఖలు అచ్చెన్నాయుడు రాయలేదని ఆధారాలున్నా లీక్ వార్తలతో ఏదో పీకాలని దొంగ పేపర్, ఛానల్ తాపత్రయపడడంలో తప్పులేదు. ఎందుకంటే రూ. 10 షేర్ రూ. 1440లకు అమ్ముడుపోయింది. కానీ మిగిలిన వాళ్లు క్విడ్ ప్రోకో వార్తల ట్రాప్‌లో పడితే ఉన్న వాల్యూ పడిపోతుందని’’లోకేష్ అన్నారు.

Updated Date - 2020-02-21T20:27:34+05:30 IST