TS:ఆరేళ్ల చిన్నారి లైంగిక దాడికి యత్నం

ABN , First Publish Date - 2022-07-23T12:35:08+05:30 IST

రాయికోడ్‌ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. శుక్రవారం ఎస్‌ఐ

TS:ఆరేళ్ల చిన్నారి లైంగిక దాడికి యత్నం

మెదక్/రాయికోడ్‌: రాయికోడ్‌ మండల పరిధిలోని  ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. శుక్రవారం ఎస్‌ఐ ఏడుకొండలు  తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆరేళ్ల చిన్నారి తమ ఇంటి ముందు గురువారం సాయంత్రం ఆడుకుంటున్నది. దాదాపు 7 గంటల ప్రాంతంలో చిన్నారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో గ్రామానికి చెందిన సర్దార్‌ (30)  అనే వ్యక్తి చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపి గ్రామానికి కొద్దిదూరంలో జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారానికి యత్నించగా భయపడిన చిన్నారి బిగ్గరగా ఏడవడంతో నిందితుడు పారిపోయాడు. చిన్నారి ఇంట్లో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా, వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-07-23T12:35:08+05:30 IST