కుళ్లిన ఆలుగడ్డలతో అల్లం పేస్ట్‌

ABN , First Publish Date - 2022-05-18T17:08:56+05:30 IST

నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కంపెనీలపై జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులు దాడులు చేశారు. కమిషనర్‌ జి.పి.కుమార్‌ ఆధ్వర్యంలో

కుళ్లిన ఆలుగడ్డలతో అల్లం పేస్ట్‌

కమిషనర్‌ తనిఖీల్లో వెలుగులోకి..  రెండు సంస్థల సీజ్‌

హైదరాబాద్/పహాడీషరీఫ్‌: నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కంపెనీలపై జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులు దాడులు చేశారు. కమిషనర్‌ జి.పి.కుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బంది పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమల్లో తనిఖీలు చేశారు. నాలుగు బ్యాటరీ కంపెనీలతో పాటు, అల్లం వెల్లుల్లి తయారీ కంపెనీ, పుట్నాలు, కుర్‌కురే తయారీ కంపెనీలను పరిశీలించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కుళ్లిన ఆలుగడ్డలు, అరటి పళ్లు, ఉప్పు, బటర్‌సోడా, మిశ్రమం కలిపి పేస్ట్‌ తయారు చేస్తున్న సంస్థను సీజ్‌ చేశారు. నకిలీ కుర్‌కురే కంపెనీని కూడా సీజ్‌ చేశారు. జీరో దందా (ట్యాక్స్‌ చెల్లించని) పుట్నాల కంపెనీ, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయని గ్లాస్‌ఫ్యాక్టరీని మూయించారు. ఇద్దరు బాల కార్మికులను గుర్తించారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితులను జైలుకు పంపుతామని కమిషనర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-18T17:08:56+05:30 IST