Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాన గంధర్వునికి అమెరికా తెలుగు సంఘం స్వరనీరాజనం

డల్లాస్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ కార్యవర్గ బృందం శనివారం సెప్టెంబర్ 25న డల్లాస్ గాయనీ గాయకులచే స్వర్గీయ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. బాలును స్మరించుకుంటూ.. ఆ గాన గంధర్వునికి స్వర కుసుమాలను నీరజనాలుగా అందిస్తూ "బాలు గాన సుధా స్మృతి" అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. ఆటా సంస్థతో బాలుకు ఉన్న సంబంధం ఎనలేనిది. 1992 సంవత్సరం ఆటా రెండవ మహాసభలు న్యూయార్క్‌లో జరిగినప్పుడు బాలు సంగీత విభావరి కార్యక్రమానికి వచ్చారు. ఆ తర్వాత 2000 ఏడాది అట్లాంటాలో జరిగిన ఆరో ఆటా మహాసభలలో బాలుకు ఆటా సంస్థ జీవన సాఫల్య పురస్కారం అందించింది. 2014 సంవత్సరం పెన్సిల్వేనియాలో జరిగిన పదమూడో ఆటా మహాసభలలో పాడుతా తీయగా కార్యక్రమం ఆటా వేదికపై జరిపారు.


ఆటా “బాలు గాన సుధా స్మృతి"  కార్యక్రమంలో తెలుగు చిత్రసీమ సంగీత దర్శకుల సారథ్యంలో బాలు పాడిన వేల పాటలలో మచ్చుకు సుమారు యాభై  పైచిలుకు గీతాలను రాజశేఖర్ సూరిభొట్ల, సంతోష్ ఖమ్మామ్కర్, జానకి శంకర్, సాయి రాజేష్ మహాభాష్యం, సృజన ఆడూరి, ప్రభాకర్ కోట, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, నాగి వడ్లమన్నాటి, బాలాజి నరసింహన్, వీణ యెలమంచలి, జ్యోతి సాదు, మల్లిక సూర్యదేవర, రోషిని బుద్ధలు ఎంతో కమనీయంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి  శారద సింగి రెడ్డి, రవి తూపురాణి  వ్యాఖ్యాతలుగా వ్యవహరించి బాలుగారి ఔన్నత్యం, ఆయన పాడిన పాటల విశేషాలను సవివరంగా వర్ణిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ అరవింద్ రెడ్డి, సతీష్ రెడ్డి, శారద సింగిరెడ్డి, రామ్ అన్నాడి, అడ్వైజరి కమిటీ సంధ్య గవ్వ, పూర్వ కార్యదర్శి అనంత్ రెడ్డి పజ్జూర్, రీజినల్ కోఆర్డినేటర్స్ మహేష్ మానపురి, సుమన సారెడ్డి, స్టాండింగ్ కమిటీ మంజు రెడ్డి ముప్పిడి, మహేందర్ గనపురం, దామోదర్ ఆకుల, మాధవి లోకిరెడ్డి సంయుక్తంగా శ్రీని ప్రభల, రాజశేఖర్ సూరిభొట్లను ఆటా ఝుమ్మంది నాదం 2021లో జరిగిన పాటల పోటీలకు న్యాయ ర్ణేతలుగా వారు  అందించిన సేవలను గుర్తించి సన్మానించారు. అలాగే రవి తూపురాణి, బాల గనపవరపు ఆటాకు వారు నిస్వార్థంగా అందించిన సేవలను గుర్తించి సన్మానించారు. బోర్డు ఆఫ్ ట్రస్టీ సతీష్ రెడ్డి ఆటా అందించే సేవా కార్యక్రమాలు అలాగే ఆటా సభ్యతం కలిగిన వారికి ఆటా కలిగించే సదుపాయాలను వివరించారు. ఆ తర్వాత 2022లో ఆటా 17వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌కి వాల్టర్ యి కన్వెన్షన్ సెంటర్ వాషింగ్టన్ డీసీకి స్వాగతం పలికారు. 

   

ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని బాలుతో ఆటా సంస్థకి ఉన్న అనుబంధాన్ని  నెమరువేసుకున్నారు. అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఆయన లేని లోటు ఎప్పటికి తీరదని ఆయన మన మధ్య లేక పోయినా ఆయన పాట చిరస్థాయిగా సంగీత ప్రియుల హృదయాలలో నిలిచి ఉంటుందని బాలు పాట అజరామరం అని తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement