ఆటా ఆధ్వర్యంలో ఘనంగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'

ABN , First Publish Date - 2021-03-10T23:10:27+05:30 IST

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మార్చి 7న ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈసారి వేడుకలను జూమ్ ద్వారా నిర్వహించారు.

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'

మెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మార్చి 7న ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈసారి వేడుకలను జూమ్ ద్వారా నిర్వహించారు. ఆటా అధ్యక్షులు భువనేష్ భుజాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా ఆటా నేషనల్ ఉమెన్స్ చైర్ అనితా యాజ్ఞిక్ వ్యవహరించారు. ఆమె సహ బృందం కార్యక్రమ నిర్వహణను విజయవంతగా జరిపారు. ప్రెసిడెంట్ భువనేష్ భుజాల ముందుగా మహిళలందరికి అభినందనలు తెలుపుతూ అన్నిరంగాలలో వారు చేస్తున్న అభివృద్ధి, సేవకార్యక్రమాలను ప్రశంసించారు. ముఖ్య అతిథి పదకోకిల, పద్మశ్రీ డా. శోభారాజు అన్నమయ్య ప్రార్థనగీతంతో కార్యక్రమం ఆరంభించి స్త్రీ ఔన్నత్యము, గొప్పదనము గురించి వివరించారు. విశిష్ట అతిథి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ పద్మశ్రీ సుధామూర్తి.. స్త్రీలు అన్ని వృత్తిరంగాలలో సాధిస్తున్న పురోగాభివృద్ధిని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మహిళా దినోత్సవం సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్త్రీ శక్తి చాలగొప్పదని చెప్పారు.


ఆటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేదికపై వక్తలుగా నర్సాపేట్ కలెక్టర్ హరిచందన దాసరితోపాటు ముఖ్య అతిథులుగా మహిళా రాజకీయవేత్తలు సునీత లక్ష్మారెడ్డి, డి.కె.అరుణ, సీతక్క వేదికను అలంకరించారు. సినిమా రంగం నుండి లయ, నందిని సిద్ధారెడ్డి.. అమెరికా మిలిటరీ విభాగం నుండి సౌమ్య శ్రీరామా ఈ వేడుకలలో పాల్గొని వారి అభిప్రాయాలను శ్రోతలతో పంచుకున్నారు. అమెరికా తెలుగు సంఘాలలో నిర్వాహక పదవులలో సేవలందిస్తున్న డా. సంధ్యా గవ్వ, జాన్సీరెడ్డి, డా. మెహర్ మాధవరం, కవితా చెల్లా, అటార్నీ జనేత కంచర్ల గారు నాయకత్వ రంగంలో స్త్రీల ప్రయాణం, సాంఘీక సేవల గురించి వివరించారు. మహిళలు మరియు సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై అపర్ణ కడారి ప్రసంగించారు.


కోవిడ్ మహమ్మారి వల్ల ఇంటి నుంచే పనిచేయటంతో గృహహింస సంఘటనలు చాలా ఎక్కువగా పెరిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 'మహిళలు, న్యాయవాదం' అనే అంశంపై మధురిమ బోయపాటి పాటూరి, వారి సహ బృందం మహిళల హక్కుల కోసం ఒకరికి ఒకరు సాయం చేసుకొనేలా వారి మధ్య సోదరీతత్త్వం పెంచుకునేలా చర్చ జరిపి, మహిళలకు ఏ విధంగా సహాయం చేయ్యెుచ్చొ తెలిపారు. అలాగే వైద్యపరంగా సేవల గురించి లక్ష్మికోన తెలియజేశారు. యోగ గురువు శ్రీదేవి తాడేపల్లి, యోగ చేయడం వల్ల ఆరోగ్యకరమైన లాభాలను తెలియపరిచారు. ఈ సమావేశంలో యువతులు మేఘన బుజాల, నిశిత లింగాల, అపూర్వ బొమ్మనవేని ఉత్సాహంతో పాల్గొనడంతో పాటు అనేక యుక్తమైన విషయాలపై ప్రసంగిచారు. ఉదాహరణకు అమెరికా దైనందిన జీవనంలో ఇక్కడి సంస్కృతిలో ఉన్న మంచిని అనుసరిస్తూనే మన భారతీయ సంస్కృతిని, విలువల్ని ఎలా పాటించాలన్నఅంశంపై వారు చక్కగా మాట్లాడారు. అన్నిరాష్ట్రాల నుండి యువతులు చక్కటి శాస్త్రీయ, సినీ, జానపద నృత్య గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.


ఆటా నేషనల్ ఉమెన్స్ కోచైర్ మల్లికరెడ్డి దుంపాల.. వేదికపై పాల్గొన్న అతిథులకు, వక్తలతో పాటు సాంస్కృతి కకార్యక్రమంలో పాల్గొన్న యువతులందరికి, కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన ఆట బోర్డు సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైసరి కమిటీ, రీజినల్ డైరెక్టర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఉమెన్ కోఆర్డినేటర్స్ ఆటా కార్యవర్గ బృందం అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ ప్రోగ్రాంకి ఎంతగానో సహకరించిన ఏబిఆర్ ప్రొడక్షన్స్, వారి సాంకేతిక నిపుణులందరితో పాటు యాంకర్ కృష్ణ చైతన్యకు, తరానా టీమ్‌కు, మీడియా మిత్రులు మన టీవీ, టీవీ5, టీవీ ఏసియా తెలుగు, యోయో, ఎన్ఆర్ఐ రేడియో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


Updated Date - 2021-03-10T23:10:27+05:30 IST