అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు కలిశారు. అమెరికాలో జరిగే తెలుగు మహాసభలకు సీఎంను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాద రెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్ కమిటీ చైర్మన్ సన్నీ రెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ చైర్మన్ జయంత్ చల్లా ఉన్నారు. వాషింగ్టన్ డీసీలో జులై 1 నుంచి 3 వరకు 17వ ఆటా తెలుగు మహాసభలు జరుగునున్నాయి.
ఇవి కూడా చదవండి