శాసన సభలో ప్రతి అంశం పై చర్చ జరగాలి: స్పీకర్ పోచారం

ABN , First Publish Date - 2022-03-05T22:22:16+05:30 IST

తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నసమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశం నిర్వహించారు.

శాసన సభలో ప్రతి అంశం పై చర్చ జరగాలి: స్పీకర్ పోచారం

హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నసమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశం నిర్వహించారు. శాసనమండలి ప్రోటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి, శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి.  నరసింహా చార్యులు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ యుడి) అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి,జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్,డీజీపి. మహేందర్ రెడ్డి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ-రవిగుప్తా, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ -సి.వి అనంద్, సైబరాబాద్ పోలీసు కమీషనర్- స్టిఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీసు కమీషనర్-మహేష్ భగత్, డీఐజీ (ఇంటలిజెన్స్)- శివకుమార్,  అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కరుణాకర్ తదతరులు పాల్గొన్నారు. 


ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ 8వ సెషన్ సమావేశాలు, శాసనమండలి 18వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు.గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలని ఆయన ఆదేశించారు.కరోనా ప్రభావం తగ్గినప్పటికి ఇంకా పూర్తిగా పోనందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ దరించాలి. ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్ధారణ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ వారు కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని అన్నారు.గతంలోని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి, ఈసారి కూడా అదేవిధంగా జరగడానికి పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలని కోరారు. 

Updated Date - 2022-03-05T22:22:16+05:30 IST