ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేతకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-01T00:23:57+05:30 IST

ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ దింగ్కో సింగ్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా

ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేతకు కరోనా పాజిటివ్

మణిపూర్: ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ దింగ్కో సింగ్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత కరోనా సోకిన తొలి భారత క్రీడాకారుడిగా అతను నిలిచాడు. 


అయితే ఈ కేసును కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న దింగ్కో సింగ్‌‌కు తగిన వైద్య సేవలు అందించాలని ఆయన మణిపూర్ ప్రభుత్వాన్ని కోరారు. 1998 ఏషియన్ గేమ్స్‌లో దింగ్కో సింగ్‌ భారత్‌కు స్వర్ణ పతకం సాధించారు.

Updated Date - 2020-06-01T00:23:57+05:30 IST