చారిత్రక కట్టడాల కూల్చివేత బాధాకరం: అశోక్ గజపతి రాజు

ABN , First Publish Date - 2020-05-23T17:12:55+05:30 IST

విజయనగరం: చారిత్రక కట్టడాలు కూల్చివేత బాధాకరమని మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు పేర్కొన్నారు.

చారిత్రక కట్టడాల కూల్చివేత బాధాకరం: అశోక్ గజపతి రాజు

విజయనగరం: చారిత్రక కట్టడాలు కూల్చివేత బాధాకరమని మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు పేర్కొన్నారు. వందల ఏళ్ల క్రితం విజయనగరంలో నిర్మించిన మూడు లాంతర్లు కట్టడం విజయనగరానికి చారిత్రక చిహ్నంగా ఉందన్నారు. ఆనాటి విజయనగర వైభవానికి కొన్ని ఆనవాళ్లున్నాయన్నారు. అందులో గంటస్తంభం, ముడులాంతర్లు, మ్యూజిక్ కళాశాల వంటివి కొన్ని మచ్చు తునకలని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. ముడులాంతర్ల వద్ద స్వతంత్ర సమరయోధులు నిర్మించిన మూడు సింహాలు చిహ్నం కి కూడా ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వడం లేదు.


ఈనాడు రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్న  నాయకులే చారిత్రక చిహ్నాలు ధ్వంసానికి పాల్పడటం దారుణమన్నారు. ముడు లాంతర్ల జంక్షన్ వద్ద హరికథా పితామహుడు అదిభట్ల నారాయణ దాసు హరికథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.  ప్రజలు స్పందించాలి చరిత్రకు, చరిత్ర అనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలన్నారు. తాము ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతామన్నారు. ఇది మనందరి భవిష్యత్తు అని.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియచేయాలని అశోక్ గజపతి రాజు కోరారు.


Updated Date - 2020-05-23T17:12:55+05:30 IST