వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2022-02-24T19:36:52+05:30 IST

రాష్ట్రంలో భౌతిక, రాజకీయ అరాచకంతో పాటు ఆర్థిక అరాచకం కూడా పెరిగిపోతోందని అశోక్ బాబు విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం: అశోక్‌బాబు

అమరావతి: రాష్ట్రంలో భౌతిక, రాజకీయ అరాచకంతో పాటు ఆర్థిక అరాచకం కూడా పెరిగిపోతోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రూ. 7 లక్షల కోట్ల అప్పు తీర్చేందుకు ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం మోపారని ఆరోపించారు. స్కీంలు, స్కామ్‌లు తప్ప రాష్ట్రంలో బడ్జెట్ అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఐపీ పెట్టే స్థాయికి వచ్చిందని, రేపు రాష్ట్రానిదీ అదే పరిస్థితని అన్నారు. ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం పరీష్కరించలేదని, అణగదొక్కిందని విమర్శించారు. పీఆర్సీ నివేదికను కోర్టు ద్వారా ఉద్యోగులు సాధించటంతో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందన్నారు. 


కోవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు ఖర్చు అయిందని, సీఎస్ ఉద్యోగులకు చెప్తే ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో అది రూ. 8వేల కోట్లు మాత్రమేనని అశోక్ బాబు పేర్కొన్నారు. రూ. 97వేల కోట్ల బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్ లేఖ రాసినా.. తమకు సంబంధం లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దాదాపు 150 ఐటమ్స్‌కు బడ్జెట్ లేకుండా ఎలా ఖర్చు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఉన్న అప్పును తీర్చటానికి ఎక్కువ వడ్డీకి మళ్లీ అప్పులు తెస్తున్నారని, ఏపీ ప్రభుత్వానికి అప్పు ఇవ్వొద్దని కేంద్రం బ్యాంకుల్ని ఆదేశించే స్థాయి నెలకొందని అశోక్ బాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-24T19:36:52+05:30 IST